ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి హైకోర్టులో ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తనను అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ కీలక తీర్పునిస్తూ.. మిథున్ రెడ్డిని అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని హైకోర్టు తేల్చిచెప్పేసింది. దీంతో ఆయనకు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.