శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైయస్సార్, కడప, తిరుపతి, జిల్లాలకు వైయస్సార్ పార్టీ మైనార్టీ సెల్ జోనల్ ఇన్చార్జిగా సయ్యద్ హంజా హుస్సేన్ నియమించడం పట్ల ఉదయగిరి ఉపసర్పంచ్ డైరెక్టర్ గడియాల్జీ యస్దాని మంగళవారం తన స్వగృహం నందు ఆయనను కలిసి పూలమాల, శాలవతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉదయగిరి ఉపసర్పంచ్ మూర్తుజా హుస్సేన్, వక్ఫ్ బోర్డు డియాల్జీ ఎస్దాని మాట్లాడుతూ.. మూడు జిల్లాలకు జోనల్ ఇన్చార్జిగా నెల్లూరు జిల్లా వాసిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఖాదర్బాషా జోనల్ ఇన్చార్జిగా సయ్యద్ అంజా హుస్సేన్ నియమించడం హర్షనీయమన్నారు.