టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయండి: జనసేన

1998చూసినవారు
టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయండి: జనసేన
కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్నందున పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలని ఉదయగిరి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఆల్లూరి రవీంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ... విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరైన విధానం కాదని, ఇప్పటికే ఎంతో మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోన బారినపడిన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఆందోళనలకు గురి అవుతున్నారన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరిన విధంగా తక్షణమే పరీక్షలు రద్దు చేసి విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించవలసినదిగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్