పోలేరమ్మ జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

56చూసినవారు
పోలేరమ్మ జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
వరికుంటపాడు మండలం అలివేలు మంగాపురం గ్రామంలో జరుగుతున్న శ్రీ పోలేరమ్మ జాతరలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామరెడ్డి గురువారం పాల్గొన్నారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. పోలేరమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పావులూరి పుల్లయ్య, వెంకటరత్నం, మాధవరావు, నారాయణ, శ్రీనివాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్