హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా జనసేన, బీజేపీ పార్టీలు సంయుక్తంగా ధర్మ పరిరక్షణ దీక్షకు పిలుపునిచ్చిన సందర్భంగా జనసేన పార్టీ ఉదయగిరి నియోజకవర్గ నాయకులు ఆల్లూరి రవీంద్ర ఆధ్వర్యంలో సీతారామపురంలో హిందూ ధర్మ పరిరక్షణ దీక్ష చేశారు. ఆల్లూరి రవీంద్ర మాట్లాడుతూ... జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు హిందూ ధర్మ దీక్ష చేయడం జరిగిందని వారు అన్నారు. హిందూవులను, హిందూ ధర్మాన్ని కించపరిచేలా రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరగడం దూరదృష్టకరమని, హిందూ ధర్మ పరిరక్షణ మనందరి బాధ్యతని, సర్వమతాలను జనసేన పార్టీ గౌరవిస్తుందని, అన్ని మతాల ధర్మలు, వారి ఆచార సంస్కృతుల పరిరక్షణ మనందరి భాద్యతని వారు తెలిపారు.
హిందూ దేవాదాయలకు ప్రభుత్వం పటిష్ట భద్రత కల్పించాలని ప్రభుత్వన్ని వారు కోరారు. పిఠాపురం విగ్రహాల ధ్వంసం, కొండ బిట్రగుంట రథం దహనం, అంతర్వేదిలో జరిగిన రథం దహనం ఘటనలపై పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా రిటైడ్ న్యాయమూర్తితో పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను శిక్షించాలని ప్రభుత్వాన్నీ వారు డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు పాలిశెట్టి శ్రీనువాసులు, గుంటూరు శుభాని, మండపాటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.