జిల్లాలోని కలిగిరి మండలంలో గల మోడల్ స్కూల్, జడ్పిహెచ్ స్కూల్లో రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఆరోగ్య పరీక్షలను కావలి డిప్యూటీ డిఎంహెచ్ఓ బ్రిజిత గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులతో మాట్లాడి వారికి పలు రకాల ఆరోగ్య సూచనలు సలహాలు చేశారు.