శాంతియుత రిలే నిరాహారదీక్షలు

545చూసినవారు
శాంతియుత రిలే నిరాహారదీక్షలు
రాష్ట్రంలో కరోనా రోజురోజుకీ పెరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ తరుణంలో ప్రభుత్వాలు ప్రజలకు అండగా నిలవాలని కోరుతూ ఏపీ బిసి చైతన్య సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి వద్ద నుండే సభ్యులు శాంతియుత రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా ఏరుకొల్లు గ్రామంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ దీక్షను చేపట్టారు మహేంద్ర అభిమన్యు మోడీ.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ బీసీ చైతన్య సమితి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని డిమాండ్లను చేస్తోందన్నారు. డిమాండ్లలో మొదటగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసుపత్రులలో బెడ్లు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలన్నారు , అలానే ప్రతి మున్సిపాలిటీలో కరోనా వైద్యం అందించే ఆసుపత్రిని ఏర్పాటు చేయాలన్నారు, ప్రస్తుత కరోనా సంక్షోభాన్ని ఆసరాగా ఉపయోగించుకుని ప్రజల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులను నియంత్రించాలి అన్నారు.

అదే విధంగా కరోనా కారణంగా పనులు లేక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అందుచేత వారందరినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలన్నారు. ఏపీ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో, బీసీ రమణ గారి అధ్యక్షతన చేస్తున్న రిలే నిరాహారదీక్షల యొక్క ఉద్దేశ్యం ప్రభుత్వాలు పరిశీలించి ప్రజలను ఆదుకోవాలన్నదే ముఖ్య ఉద్దేశ్యమని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్