నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పలుపుమేరకు ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని ఉదయగిరి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉదయగిరి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ... మెట్టప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో నివర్ తుఫాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.
అధికంగా పంట నష్టం జరిగిందని ప్రభుత్వం తక్షణమే సహాయం చేసి రైతులను ఆదుకోవాలని వారు తహశీల్దార్ కు వినతిపత్రం ఇచ్చారు. నష్టపోయిన రైతులకు తక్షణ సహాయంగా 10 వేలు, పూర్తి సహాయం 35 వేలు ఇవ్వవలసినదిగా వారు ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు ఆల్లూరి రవీంద్ర, నిమ్మలపల్లి రామచైతన్య, కమతం శ్రీనివాసులు, మండల ఇంచార్జ్ లు రవికుమార్, సురేంద్ర రెడ్డి, నాయబ్ రసూల్ పఠాన్ , పాలిశెట్టి శ్రీనివాసులు, కిరణ్ కుమార్, హరికృష్ణ, సంకతాల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.