ప్రభుత్వాలు మారినప్పటికీ ఆశా కార్యకర్తల సమస్యలకు మాత్రం పరిష్కారం దొరకడం లేదని ఆశా కార్యకర్తలు అన్నారు. సీతారాంపురం ప్రభుత్వాసుపత్రి డాక్టర్ స్వప్నకు ఆశా కార్యకర్తలు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఆశా కార్యకర్తల జీతాలు పెంచాలని, అధికంగా పని భారం తగ్గించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలని, ప్రతి ఆశా కార్యకర్తకు ఆరోగ్య భద్రత కల్పించాలని వినతిపత్రంలో పొందుపరిచి డాక్టర్ కుడాక్టర్కు అందజేశారు.