సీతారాంపురం మండలం పండ్రంగిలో బుధవారం భూ సమస్యలపై గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల సమస్యలపై గ్రామస్తులు తహసిల్దార్ వెంకటకృష్ణారెడ్డికి వినతి పత్రాలు అందజేశారు. రీ సర్వేలో భాగంగా భూముల్లో జరిగిన అవకతవకలు గుర్తించి సరి చేస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రీ సర్వే కార్యక్రమాన్ని సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.