నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల కేంద్రంలోని బీసీ కాలనీ సమీపంలో ఉన్న శ్రీ సంతాన లక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రధాన అర్చకుడు లోక ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని ఆలయ పరిసరాలను ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి శ్రీ సంతాన లక్ష్మి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు.