గతేడాది భారతదేశంలో ప్రతి ఐదు రోజులకు ఒక కొత్త బిలియనీర్ తయారయ్యాడని హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 గురువారం వెల్లడించింది. 2023లో భారత్ లోని బిలియనీర్ల సంఖ్య 29% పెరిగి 334కి చేరుకోగా, చైనాలో మాత్రం 25% పడిపోయిందని హురూన్ ఇండియా వ్యవస్థాపకులు అనస్ రెహమాన్ జునైద్ తెలిపారు. రూ.1,000 కోట్ల కంటే ఎక్కువ సంపద ఉన్న వ్యక్తులు ఈ జాబితాలో 1,500 మంది కంటే ఎక్కువగా ఉండటం ఇదే తొలిసారి అని ఆయన ఆన్నారు.