వడోదరలోని ఎంఎస్ యూనివర్సిటీలో 11 అడుగుల భారీ మొసలి ప్రత్యక్షం

85చూసినవారు
వడోదరలోని ఎంఎస్ యూనివర్సిటీలో 11 అడుగుల భారీ మొసలి ప్రత్యక్షం
గుజరాత్ లోని వడోదరలో ఉన్న మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా క్యాంపస్ లో గురువారం భారీ మొసలి ప్రత్యక్షమైంది. మగ్గర్ రకానికి చెందిన ఈ మొసలి 11 అడుగుల పొడవున్నట్లు అధికారులు తెలిపారు. వర్సిటీలోని జూవాలజీ విభాగం సమీపంలో ఈ మొసలి కనిపించింది. ఈ మొసలి విశ్వామిత్ర నది నుంచి ఇక్కడికి వచ్చి ఉంటుందని అధికారులు తెలిపారు. గత నెలలో వడోదరలో 21 మొసళ్లను అధికారులు రక్షించారు.

సంబంధిత పోస్ట్