ఎన్నికల్లో ఓటమి వల్ల పార్టీ పని అయిపోదు: పేర్ని నాని

539చూసినవారు
ఎన్నికల్లో ఓటమి వల్ల పార్టీ పని అయిపోదు: పేర్ని నాని
జగన్‌ను రాజకీయంగా అడ్డు తొలగించుకోవడం కోసం మొదటి నుంచి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. టీడీపీలో వైసీపీ వారిని చేర్చుకోవటం ద్వారా జగన్‌కు రాజకీయంగా అంగుళం కూడా ఏం కాదన్నారు. ఎన్నికల్లో ఓటమి వల్ల పార్టీ పని అయిపోదన్నారు. ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు ఎవరో ఒకరి సపోర్ట్ ద్వారానే ప్రభుత్వం ఏర్పాటు చేశారని.. చంద్రబాబుకి ఎవరో ఒకరు సాయం ఉంటే తప్ప గెలవటం కుదరదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్