దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో గురువారం ఉదయం 11:30 గంటలకు భూకంపం సంభవించింది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్లో ఉన్నట్లు సమాచారం. నేషనల్ సిస్మోలజీ సెంటర్ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లో బలమైన భూకంపం సంభవించింది, దీని ప్రకంపనలు ఢిల్లీలో కనిపించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదైంది. ఢిల్లీలో భూప్రకంపనల కారణంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.