తనపై గత ప్రభుత్వ హయాంలో పోలీసు అధికారులు తనపై, తన కుటుంబంపై తీవ్ర వేధింపులు చేశారని.. ముంబైకి చెందిన ఓ బాలీవుడ్ నటి ఇటీవల ఆరోపణలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. దీంతో ఈ ఘటనపై తాజాగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. నటిని వేధించిన కేసులో ఎవరున్నా సరే వదిలిపెట్టేది లేదని, విచారణ జరిపి జగన్ ఎక్కడ తిరగాలో నిర్ణయిస్తామని అన్నారు.