మీ సేవలకు ధన్యవాదములు

1163చూసినవారు
మీ సేవలకు ధన్యవాదములు
కరోనా సంక్షోభ సమయంలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యమే మొదటి ప్రాముఖ్యంగా సేవలందిస్తున్నటువంటి ప్రజా సేవకులకు పాదాభివందనాలు అని ఏరుకొల్లు గ్రామంలో వారి సేవలను వివరిస్తూ చిన్నపాటి అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి క్లిష్ట సమయంలో నర్సులు చేస్తున్న సేవ మరువలేనదన్నారు. నర్సుల చేతులతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే మాటను నిజం చేస్తూ అనునిత్యం అంకితభావంతో సేవ చేస్తున్నారన్నారు. వారి సేవలను ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా కొనియాడుతూ అన్ని సమయాలలో గుర్తుంచుకుంటారన్నారు.

ఈ కరోనా సమయంలోనే కాదు ఎటువంటి విపత్తు వచ్చినా ప్రతి సమయంలో కూడా మేమున్నామంటూ ముందుకు వస్తున్నారన్నారు. అందుకు ప్రజలందరూ వారికి రుణపడి ఉంటారని చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో సేవలందిస్తున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ మీ కర్తవ్యాన్ని నిర్వహించాలని కోరుతూ ఇకనుంచి మే 12ను ప్రజలందరూ ఓ పండుగలా జరుపుకుంటారని తెలియజేస్తూ నర్సులందరికీ అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్