ఉదయగిరి లోని సిపిఎం కార్యాలయంలో వెలుగొండ సాధన సమితి సభ్యులు సోమవారం సమావేశం అయ్యారు. వెలుగొండ సాధన సమితి ప్రధాన కార్యదర్శి షేక్. దస్తగిరి అహ్మద్ మాట్లాడుతూ చరిత్రలో నదుల తీర ప్రాంతంలోనే నాగరికత వెల్లివిరిసిందని నీరు ఎక్కడ ఉంటే అక్కడ మనుషులు నివాసయోగ్యంగా ఎంచుకున్నారని కాబట్టి ఉదయగిరి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వెలుగొండ ప్రాజెక్టు నీళ్ళు మెట్ట ప్రాంతమైన ఉదయగిరి పరిసర ప్రాంత ప్రజలకు అవసరమన్నారు.