ఉదయగిరి: మద్యం షాప్ తొలగించాలని వినతి

55చూసినవారు
ఉదయగిరి: మద్యం షాప్ తొలగించాలని వినతి
నూతనంగా లాటరీ ద్వారా మద్యం షాపులు గెలుచుకున్న వారు మద్యం షాపులు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయగిరి పట్టణంలోని బాలాజీ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం షాపును అక్కడ నుంచి తొలగించాలని స్థానికులు ఎక్సైజ్ సీఐ తన్నీరు లక్ష్మణస్వామికి బుధవారం వినతిపత్రం అందజేశారు. చుట్టుపక్కల నివాసాలు, పాఠశాలలు, ఆస్పత్రులు ఉన్న కారణంగా అక్కడ షాపు ఏర్పాటు చేయడం సరైన పద్ధతి కాదని వెంటనే తొలగించాలని కోరారు.

సంబంధిత పోస్ట్