నెల్లూరు జిల్లా అటవీ శాఖ అధికారి (డీఎఫ్ఓ) కదిరి మహబూబ్ బాషా బుధవారం ఉదయగిరి అటవీ శాఖ రేంజ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలోని సిబ్బందితో ఆయన మాట్లాడారు. అడవుల సంరక్షణపై వారికి పలు సూచనలను సలహాలు చేశారు. అడవులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అడవుల్లో ఎవరైనా కొత్త వ్యక్తులను గుర్తించినట్లయితే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన తెలిపారు.