వరికుంటపాడు మండలం రామపురం గ్రామంలో 104 వాహనం ద్వారా వైద్యాధికారిణి కరిష్మా ఆధ్వర్యంలో బుధవారం ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 57 మందిని పరీక్షించి మందులు అందజేశారు. అలాగే గర్భిణీలు, బాలింతలకు పలు సూచనలు సలహాలు చేశారు. పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన రక్తహీనత తగ్గుతుందని తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.