జిల్లాలోని వరికుంటపాడు మండలం జంగం రెడ్డిపల్లిలో ఇటీవల కొందరు తెల్లరాయి తవ్వకాలు చేపట్టేందుకు జెసిబితో ప్రయత్నించారు. దీనిని గ్రామస్తులు అడ్డుకొని రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. తవ్వకాలకు అనుమతులు ఉన్నాయని పోలీసులు చెప్పడంతో గ్రామస్తులు గురువారం నిరసన చేశారు. అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని నినాదాలు చేశారు. తవ్వకాలకు అసలు అధికారులు ఏ విధంగా పరిమిషన్ ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.