వింజమూరు మండలంలో జరగవలసిన సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీవో శ్రీనివాసులు రెడ్డి గురువారం తెలిపారు. 12 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను కేవలం ఇద్దరే హాజరు కావడం, అందులోనూ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిన ఎంపీపీ రాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే నూతన తేదీని ప్రకటిస్తామన్నారు.