'ఛలో మంగళగిరి' కి పాదయాత్ర చేయనున్న జనసేన నాయకులు

1118చూసినవారు
'ఛలో మంగళగిరి' కి పాదయాత్ర చేయనున్న జనసేన నాయకులు
ఈనెల 14వ తేదీన మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు, చిరంజీవి యువత అధ్యక్షులు కోనా రవిశంకర్, జనసేన వెంకటగిరి మండల పార్టీ అధ్యక్షులు గుగ్గిళ్ల నాగరాజు శుక్రవారం ఉదయం 5 గంటలకు పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మంగళగిరికి పాదయాత్రగా వెళ్తున్నారు. ఈ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని, 13వ తేదీ రాత్రికి జనసేన పార్టీ సెంట్రల్ కార్యాలయం మంగళగిరికి చేరుకొని సమస్యలను జనసేన పార్టీ జాతీయ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ కు అందజేస్తామని చెప్పారు. పాదయాత్రలో పాల్గొనే కోనా రవిశంకర్, గుగ్గిళ్ళ నాగరాజు ప్రజలు తమ పాదయాత్రలో ఏవైనా సమస్యలు ఉంటే తమకు తెలియజేయవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్