భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య

85చూసినవారు
భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య
ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో దారుణం జరిగింది. 28 ఏళ్ల వ్యక్తిని అతని భార్య గొడ్డలితో నరికి చంపింది. పెళ్లయి చాలా రోజులు గడిచినా భార్య గర్భం దాల్చలేదు, కాబట్టి భర్త ఆమెతో కలిసి ఉండనని, ఆమెను వదిలి వేరే స్త్రీని చూసుకుంటానని చెప్పాడు. బిడ్డను కనివ్వకుంటే వేరే మహిళను పెళ్లి చేసుకుంటానని బెదిరించాడు. దీంతో భార్య కోపంతో అతడినిగొడ్డలితో నరికి చంపేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్