కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కు క్యాన్సర్ సోకిన విషయం తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే, అమెరికాలో శివరాజ్ కుమార్ కు క్యాన్సర్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. దాదాపు 4-5 గంటల పాటు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శివరాజ్ కుమార్ సన్నిహిత వర్గాలు దీనికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించాయి.