
వెంకటగిరి: చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే కురుగొండ్ల
వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండల పరిధిలోని మేల్చూరు గ్రామ చెరువు కట్టను శుక్రవారం వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పరిశీలించారు. పెరిమిడి పంచాయతీలోని రెండురోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు మేల్చూరు గ్రామ చెరువు తెగిపోయింది. టీడీపీ నాయకులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన తెగిన చెరువుకట్టను నాయకులతో కలసి పరిశీలించారు.