AP: అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన నేడు(గురువారం) నెల్లూరు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే కాకాణి విచారణకు హారావుతారా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో ఇవాళ ఉదయం 11 గంటలకు ఆయన నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి రావాలని ఇటీవల పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే ఆయనకు 3 సార్లు నోటీసులు అందజేశారు.