ఏపీ ఎన్నిక‌ల‌కు 18న నోటిఫికేష‌న్

62చూసినవారు
ఏపీ ఎన్నిక‌ల‌కు 18న నోటిఫికేష‌న్
2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఈ నెల 18న నోటిఫికేషన్ వెలువ‌డుతుంద‌ని ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా వెల్ల‌డించారు. 18 నుంచి 25 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంటుంద‌ని తెలిపారు. ఏప్రిల్ 26న స్క్రూటినీ జరుగుతుంద‌ని పేర్కొన్నారు. మే 13న రాష్ట్రంలో పారదర్శకంగా, స్వేచ్ఛగా పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామ‌ని వివ‌రించారు. నెల్లూరు ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న ఈ మేర‌కు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్