గన్నవరం: మాజీ శాసనసభ్యులు రావికి ఘన సన్మానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా గుడివాడ మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్ ఏ సి కళ్యాణ వేదిక నందు గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ఆయనకు పుష్ప గుచ్ఛం అందచేసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.