భారతదేశపు తొలి మహిళా ప్రధాని ఉక్కుమనిషి స్వర్గీయ ఇందిరా గాంధీ 127వ జయంతిని మంగళవారం గన్నవరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గన్నవరం నియోజకవర్గం అసెంబ్లీ కోఆర్డినేటర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లు కృష్ణ ఆధ్వర్యంలో స్థానిక మూడు బొమ్మల కూడలి వద్ద ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇండియా అంటే ఇందిరమ్మని ఇందిరమ్మ అంటే ఇండియా అని కొనియాడారు.