నాటు సారా స్థావరాలపై అధికారులు దాడులు

73చూసినవారు
నాటు సారా స్థావరాలపై అధికారులు దాడులు
విస్సన్నపేట, గంపలగూడెం మండలాల్లో నాటు సారా స్థావరాలు, బెల్ట్ షాపులపై గురువారం స్పెషల్ ఎంఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడి చేశారు. ఈ దాడుల్లో విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామానికి చెందిన బాణావతి ఉష అనే మహిళను అదుపులోకి తీసుకొని మూడు లీటర్లు నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అమ్మిరెడ్డిగూడెంలో నాటుసారా తయారీ సిద్ధంగా ఉన్న 400 లీటర్ల బెల్లపు ఓటను ధ్వంసం చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్