గణపతిని దర్శించుకున్న ఎమ్మెల్యే

65చూసినవారు
గణపతిని దర్శించుకున్న ఎమ్మెల్యే
విజయవాడ తూర్పు 11వ డివిజన్ వివేకానంద కాలనీలో.. తెలుగుదేశం పార్టీ నాయకులు బెజవాడ నజీర్ ఆధ్వర్యంలో పవర్ ఫ్రెండ్ సర్కిల్, గాంధీ యూత్ ఆధ్వరంలో వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆదివారం విచ్చేసి శాస్త్రోత్తంగా మంత్రోచ్చారణ నడుమ వినాయకుని ప్రతిమను దర్శించికున్నారు. తారతమ్య భేదాలు లేకుండా కులమతాలకు అతీతంగా క్రమశిక్షణతో ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం సంతోషకరమైన విషయమని తెలిపారు.

సంబంధిత పోస్ట్