ఒక ఇంజక్షన్‌కు బదులు మరొకటి.. వ్యక్తి మృతి

83చూసినవారు
AP: విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు అను హాస్పిటల్‌లో డాక్టర్లు నిర్లక్ష్యం బయటపడింది. డ్యూటీ డాక్టర్ రాసిన ఇంజక్షన్‌కు బదులు వేరే ఇంజక్షన్‌ను హాస్పిటల్ ఫార్మసీ సిబ్బంది ఇచ్చారు. చెక్ చేసుకోకుండా డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యంగా ఇంజక్షన్ చేశారు. దీంతో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మృతి చెందాడు. మిగిలిన డబ్బులు కడితేనే మృతదేహం అప్పగిస్తామని ఆసుపత్రి యాజమాన్యం తేల్చి చెప్పింది. దీంతో మృతుని బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్