AP: ఒంగోలు జాతి ఎడ్లు తెలుగువారి పౌరుషానికి, రాజసానికి ప్రతీక అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన ఒంగోలు జాతి జాతీయ స్థాయి ఎడ్ల బల, పశుపాల ప్రదర్శనకు ఆయన మాట్లాడారు. మన సంస్కృతిని, సంప్రదాయాన్ని తెలిపే గ్రామీణ క్రీడల్లో ఈ జాతి ఎడ్ల బల, పశుపాల ప్రదర్శనను భాగం చేయడం సంతోషకరమని అన్నారు. ఇలాంటి పోటీలు, ప్రదర్శనలు ప్రజల్లో ఐకమత్యం పెంచడంతోపాటు ఆరోగ్యకర జీవనానికి తోడ్పడతాయన్నారు.