AP: సీఎం చంద్రబాబు సోమవారం కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, ఆ శాఖ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజీ ప్రకటన, ప్లాంట్ పురోగతి, బ్లాక్ ఫర్నెస్‌లపై వారు చర్చించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర ప్రజలకు స్టీల్ ప్లాంట్‌కు భావోద్వేగ అనుబంధం ఉన్నారు. అందుకోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం వెల్లడించారు.