తెనాలి: ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలి
మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి పట్టణ గ్రంథాలయంలో జరుగుతున్న 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుస్తక పాఠకులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పుస్తకానికి మించిన స్నేహితుడు ఎవరూ ఉండరని పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని మంత్రి నాదెండ్ల సూచించారు.