తెనాలి: రూ. 15 లక్షల విలువైన వెండి, బంగారం చోరీ

55చూసినవారు
తెనాలి తోటవారి వీధిలో నివసిస్తున్న మల్లికార్జున శర్మ అనే వ్యక్తి ఇంటిలో శుక్రవారం చోరీ జరిగింది. శర్మ వారం రోజుల క్రితం ఒక యాగం చేయడానికి వేరే ప్రాంతానికి వెళ్లాడు. శుక్రవారం ఇంటికి వచ్చి చూడగా ఇంటి, బీరువా తాళాలు పగలగొట్టి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సుమారు రూ. 15 లక్షల విలువ గల వెండి, బంగారం చోరీ చేసినట్లు సీఐ మల్లికార్జున రావు తెలిపారు.

సంబంధిత పోస్ట్