

కొల్లిపరలో క్రెడిట్ క్యాంప్
వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కొల్లిపర మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం క్రెడిట్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కె. విజయలక్ష్మి, అత్తోట, కొల్లిపర ఎస్బీఐ మేనేజర్ రమేష్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ నరేష్, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొని లబ్ధిదారులకు సబ్సిడీ రుణాలు అందజేశారు.