తిరుమల వెంకటేశ్వరస్వామిని మంత్రి నాదెండ్ల మనోహర్ దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు, వేద పండితులు నాదెండ్లకు ఆశీర్వచనాలు అందజేసి, ఆలయ ప్రాంగణంలో పట్టు వస్త్రాలతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు.