వినుకొండ: ప్రాజెక్టులను జగన్ నిర్వీర్యం చేశారు: ఎమ్మెల్యే
ఎన్డీఏ ప్రభుత్వం హయాంలోనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీలో పోలవరం, జలవనరుల ప్రాజెక్టులపై ఆయన మాట్లాడారు. '2014-19లో సాగునీటికి టీడీపీ ప్రభుత్వం రూ. 68, 293 కోట్లు వెచ్చించి 62 ప్రాజెక్టులు మొదలు పెట్టింది. జగన్ ప్రభుత్వం వచ్చాక సాగునీటికి రూ. 34 వేల కోట్లే ఖర్చు చేశారు.