వినుకొండ పట్టణంలోని 15వార్డులో శుక్రవారం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారని, గత ప్రభుత్వంలో పెన్షన్ రాక చాలామంది ఇబ్బంది పడ్డారన్నారు. లక్షలాది మందికి మళ్లీ కొత్త పెన్షన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.