
వినుకొండ : కమిషనర్ కీలక ప్రకటన.. నేడే లాస్ట్
వినుకొండ పట్టణ ప్రజలు, వ్యాపారులకు ఇంటి, ఖాళీ స్థలం, నీటి పన్ను చెల్లింపుదారులకు నేడే ఆఖరి తేదీ అని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ సోమవారం విజ్ఞప్తి చేశారు. పురపాలక సంఘం పరిధిలో నివసిస్తున్న వారు ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్నులను ఏక కాలంలో చెల్లించినచో 50%వడ్డీ రాయితీ గల అవకాశం నేటితో ముగుస్తుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వివినియోగం చేసుకోవాలన్నారు.