త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అర్హత కలిగిన పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోవాలని మంగళవారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కోరారు. ఈ సందర్భంగా వినకొండలో ఆయన మాట్లాడుతూ యువతకు ఓటు వజ్రాయుధమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం విద్యార్థుల బాధ్యతని తెలిపారు. నవంబర్ ఐదు లోపు ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.