రేగిడి మండలం ఒప్పంగి గ్రామానికి చెందిన చాకేటి గణనాథ (47) గత నెల 30న పాముకాటు కు గురైన సంఘటన తెలిసినదే. రాజాం కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందారు. రాజాం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతికి భార్య పార్వతి, పిల్లలు గిరిజ, రాజేంద్రప్రసాద్ ఉన్నారు. పాముకాటుతో భర్త గణనాథ మృతి చెందడంతో ఆ కుటుంబం వీధిన పడింది. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.