బొబ్బిలి నియోజకవర్గంలో మంగళవారం సంక్రాంతి శోభ నెలకొంది. చూడముచ్చటగా తీర్చిదిద్దిన రంగవల్లులలో గొబ్బెమ్మలు పెట్టి నవధాన్యాలు, పూలు చల్లారు. బంధువులంతా ఒక్కచోట చేరి పిండివంటలు, విందు భోజనాలతో ఉత్సాహంగా గడిపారు. గజరాయునివలసలో వినూత్నంగా రైతులకు ఎడ్ల బల్ల పోటీలు నిర్వహించారు. ఆటల పోటీల్లో యువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎక్కడ చూసినా సంక్రాంతి వేడుకలే.