బొబ్బిలి: మిలటరీ కాలనీ చెరువు ఆక్రమణపై స్పందించిన రెవెన్యూ అధికారులు

54చూసినవారు
బొబ్బిలి: మిలటరీ కాలనీ చెరువు ఆక్రమణపై స్పందించిన రెవెన్యూ అధికారులు
బొబ్బిలి పట్టణంలోని మిలటరీ కాలనీ వద్ద చెరువు ఆక్రమణపై రెవెన్యూ అధికారులు స్పందించారు. తహశీల్దార్ శ్రీను ఆదేశాలతో ఆరి రామ్ కుమార్ చెరువు వద్దకు వెళ్లి ఆక్రమణ ప్రాంతంలో శనివారం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు ఆక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తక్షణమే మట్టిని తొలగించాలని ఆక్రమణదారుడికి సూచించారు.

సంబంధిత పోస్ట్