కుక్కల దాడిలో 25 గొర్రె పిల్లలు మృతి చెందిన సంఘటన గుర్ల మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. చోడవరం గ్రామానికి చెందిన సక్క చిన్నయ్య అనే గొర్రెల కాపరికి చెందిన గొర్రెపిల్లల పై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 25 గొర్రె పిల్లలు మృతి చెందినట్లు చిన్నయ్య తెలిపాడు. దీంతో గొర్రెలు కాపరి తీవ్రంగా రోధిస్తున్నాడు. గొర్రెల పెంపకం తమ జీవనాధారమని తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.