గుండె పోటుతో స్థానిక పీహెచ్ఈలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గజపతినగరంలో బుధవారం చోటుచేసుకుంది. మృతుడు షేక్ గఫూర్ గత 7 సంవత్సరాల క్రితం రాజమండ్రి నుండి గజపతినగరంకు వలస వచ్చి ఈ ప్రాంతంలో రక్షలు (తావీదులు) అమ్ముకుని జీవనం సాగించేవాడని స్థానికుల తెలిపారు. స్థానిక సాయిబాబా సేవ ట్రస్ట్, మాతృభూమి సేవా సంస్థ సహకారంతో విజయనగరం నుండి వచ్చిన ముస్లిం పెద్దలు ఆయనకు బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు.