గజపతినగరం: భక్తులతో కిటకట లాడుతున్న శివాలయాలు

61చూసినవారు
కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా గజపతినగరం మండలంలోని పలు గ్రామాల్లో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము 3 గంటల నుంచి ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు చేశారు. పురిటి పెంటలోని సరాబుల కాలనీలో మల్లికార్జున స్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుంచి క్యూలో భక్తులు వేచి ఉన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు తగు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్